టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో పూజ హెగ్డే ఒకరు. పూజా హెగ్డే నటించిన సినిమాలు విజయవంతం కావడంతో ఈమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది.హీరోయిన్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పూజాహెగ్డే రోజురోజుకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది.

పూజా హెగ్డే తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈమెకు మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. కేవలం సోషల్ మీడియా పరంగా, సినిమాల పరంగా ఎవరి జోలికి వెళ్ళకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ గతంలో ఒకసారి హీరోయిన్ సమంత విషయంలో పూజా హెగ్డే చేసిన కామెంట్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
సమంత ఏమీ అంత క్యూట్ గా కనిపించడం లేదంటూ ఈమె కామెంట్ చేశారు. తరువాత తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపారు. మొత్తానికి ఈ బుట్ట బొమ్మ చేసిన కామెంట్ సమంత అభిమానుల మధ్య పూజ అభిమానుల మధ్య చిన్న యుద్ధంలా మొదలైంది. అప్పటి నుంచి అభిమానులు సమంతకు, పూజా హెగ్డే కు మధ్య పోలికలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ విషయంలో కూడా ఇద్దరు ఒకే స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు.
తాజాగా సమంత తన ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్లకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే కూడా 13 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకోవడంతో ఆమె గాల్లో తేలిపోతున్నారు. తన అభిమానులకు, ఫాలోవర్ లకు ముద్దులు, హగ్గులు ఎమోజీ లను షేర్ చేస్తున్నారు. అదేవిధంగా అందరికీ థ్యాంక్స్ లవ్లీస్.. అంటూ ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే అఖిల్” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్”,”ఆచార్య”చిత్రాలలో చేస్తున్నారు.
































