Featured
పవన్ నియోజక వర్గం భీమవరంపై.. పూనమ్ హాట్ కామెంట్స్..!
Published
3 years agoon
By
lakshanaపవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు చాలామంది అతడి వెన్నంటే ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతడిపై టార్గెట్ చేసి మరీ మాటల బాంబులు పేలుస్తున్నారు కొంతమంది. 2019 ఎన్నికల ముందు వరకు కూడా ఇలానే అతడిపై వ్యక్తిగతంగా కూడా దూషణలకు దిగారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయితేజ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపాయి.
రాజకీయంగా చాలామంది ఆ విషయాలపై మాట్లాడారు. ఇలా చాలాకాలం తర్వాత మళ్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మళ్లీ మాటల యుద్ధాలు మొదలయ్యాయి. పోసాని అయితే ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. వ్యక్తిగతంగా కూడా విమర్శలు గుప్పించాడు. దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే పోసాని పంజాబీ అమ్మాయి అని పూనమ్ కౌర్ ను పరోక్షకంగా ప్రస్తావించి.. ఆమెను మోసం చేశాడని పేర్కొనగా అది పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
అప్పటి నుంచి పూనమ్ కౌర్ పై పవన్ కి లింక్ పెట్టి కూడా పలు ట్రోల్స్ ఇప్పటికీ నడుస్తాయి. తాజాగా పూనమ్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూస్తే.. పవన్ కళ్యాణ్ వైపే పూనమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరిగిందంటే.. ఇటీవల అంతర్జాతీయంగా రాజకీయాలపై ఓ సర్వే నిర్వహించారు. దానిలో ఏ రాష్ట్రంలో సిట్టింగ్ నేతలు ఆ పార్టీల పట్ల అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా ఆమె ఏపీ గట్టిగానే ఉంది అంటూ ట్వీట్ చేసింది.
దానికి పవన్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని టాగ్ చేసింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమె దీనిని ఏ కోణంలో ట్వీట్ చేశారో తెలియదు కానీ.. పవన్ అభిమానులు మాత్రం ఈ ట్వీట్ తో ప్రతి ఒక్కరికీ క్లారిటీ వచ్చినట్టేగా అని అంటున్నారు. ఈ ట్వీట్ తో పవన్ కు ఆమె సపోర్ట్ గా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
You may like
YSRCP vs TDP : టీడీపీయే టార్గెట్.. పవన్ వద్దు..
Pawan Kalyan – Renu Desai : పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలవబోతున్నారా? చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Pawan Kalyan : రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేస్తున్న పవన్..!
Pawan Kalyan: గ్లాస్ డైలాగుపై మరోసారి స్పందించిన పవన్.. మీరు ఒప్పుకోవాలంటూ రియాక్ట్ అయిన హరీష్?
Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ
AP politics: పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు.. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్!
Featured
Tollywood: చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటుడు.. ఎవరో తెలుసా?
Published
4 hours agoon
8 October 2024By
lakshanaTollywood: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరో హీరోయిన్ చేయడం అన్నది సాధారణం. అలా ఒక హీరో హీరోయిన్ రిజెక్ట్ చేసిన సినిమాలను మరొక హీరో హీరోయిన్లు చేసి ఆ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ గా సాధించిన విషయం తెలిసిందే. ఆ విధంగా చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకొని విలన్ నుంచి హీరోగా మారాడట ఒక నటుడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ సినిమా ఏది? అన్న వివరాల్లోకి వెళితే.. ఆ నటుడు ఎవరో కాదు మోహన్ బాబు.
చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్టు తో బ్లాక్ బస్టర్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరీర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90ల నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు చేశాడు.
దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడు గారు మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ, ప్రతినాయకుడు పాత్రలు చేయడం ఆపలేదు. 1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది.
అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకుడు కాగా ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలని అనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు చేయడం కుదరదు. సమయం పడుతుంది అన్నారట. దాంతో బి.గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయడంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ హిట్ మూవీ వేలై కీడైచుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు.
డైలాగ్ కింగ్ గా అవతారం..
మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు, తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. హీరోగా మోహన్ బాబు కెరీర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ విధంగా చిరంజీవి వద్దనుకున్న సినిమాతో సూపర్ హిట్ను అందుకొని విలన్ నుంచి హీరోగా మారాడు మోహన్ బాబు.
Featured
Sudheer Babu: మహేష్ బాబు గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు?
Published
4 hours agoon
8 October 2024By
lakshanaSudheer Babu: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాక్షన్ జానర్ నుంచి పక్కకు వచ్చి ఇలాంటి భావోద్వేగభరితమైన కథతో రావడానికి కారణమేంటి? అని అడగగా సుధీర్ బాబు మాట్లాడుతూ..
ప్రత్యేకంగా ఫలానా కథలతోనే ముందుకెళ్లాలని నేనేమీ అనుకోను. నా వద్దకొచ్చిన కథల్లో ఏది బాగుంటే దానితో ముందుకెళ్తా. అయితే అనుకోకుండా నా నుంచి ఈ మధ్య వరుసగా యాక్షన్ చిత్రాలే వచ్చాయి. నిజానికి మా నాన్న సూపర్ హీరో మూవీని హరోం హర సినిమాకు ముందే ఒప్పుకున్నాను. కాకపోతే విడుదల కాస్త అటు ఇటైంది. నేను నటుడిగా అన్ని రకాల జానర్ లు ప్రయత్నించాలనుకుంటాను. వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తే ఒక ఇమేజ్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఒక దశ దాటాక సరైన కథలు కూడా దొరకవు. అందుకే రకరకాల కథలు చేయాలనుకుంటాను. అప్పుడే దర్శకులకు నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం కలుగుతుంది అని తెలిపారు.
నమ్మకం రెట్టింపయ్యింది..
మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ చూసి మహేశ్ బాబు ఏమన్నారు? అని ప్రశ్నించగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేశ్‌బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్ కట్ ట్రైలర్ పంపిస్తే బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్ ట్రైలర్ పంపాను. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్ టచ్చింగ్ గా ఉందని అన్నారు. ఆఖర్లో వచ్చే మహేశ్ పేరున్న డైలాగ్ ఫన్నీగా ఉందని అన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా అలా తను దీని గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.
Featured
Gautam Ghattamaneni: విదేశాల్లో ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతున్న గౌతమ్ ఘట్టమనేని.. ఫొటోస్ వైరల్!
Published
4 hours agoon
8 October 2024By
lakshanaGautam Ghattamaneni: తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చెల్లెలు సితారతో పోల్చుకుంటే గౌతం చాలా సైలెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో గౌతమ్ అంత సైలెంట్ గా ఉంటాడు. సితార ఎంతో చలాకీగా తల్లితో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ చిన్న వయసులోనే తందికి తగ్గ కూతురు అనిపించుకుంది.
గౌతమ్ కేవలం ఫ్యామిలీ ఫోటోలలో తప్ప ఎక్కడ పెద్దగా కనిపించడు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటున్న గౌతం న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడు. యాక్టింగ్, సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తుండటంతో మహేష్ అభిమానులు గౌతమ్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. గౌతమ్ అమెరికాలో తనతో చదివే ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. దీంతో అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.
ఫ్రెండ్స్ తో ఎంజాయ్..
ఇటీవల తాను ఉండే రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయగా తాజాగా తన ఫ్రెండ్స్ తో రాత్రి పూట బయటకు వెళ్లిన ఫోటోలు షేర్ చేసాడు గౌతమ్. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. లిమిట్ యూనివర్సిటీ పార్ట్ 4 అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా గౌతమ్ చదువుకుంటూనే అమెరికాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఫోటోలను చూసిన అభిమానులు సూపర్ గౌతమ్ ఫ్రెండ్స్ తో ఫుల్ గా చిల్ అవుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో తక్కువగా యాక్టివ్ గా ఉండే గౌతమ్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటాడు.
Tollywood: చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటుడు.. ఎవరో తెలుసా?
Sudheer Babu: మహేష్ బాబు గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు?
Gautam Ghattamaneni: విదేశాల్లో ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతున్న గౌతమ్ ఘట్టమనేని.. ఫొటోస్ వైరల్!
Koratala Shiva: దేవర2 పై అలాంటి కామెంట్స్ చేసిన కొరటాల శివ.. మీరు చూసింది 10 శాతమే అంటూ!
Surya: స్పీడ్ పెంచేసిన హీరో సూర్య.. ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ!
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
Trending
- Featured4 weeks ago
Nithya Menon: నిత్యామీనన్ మలయాళీ అమ్మాయి కాదా… తన అసలు పేరు అదేనా?
- Featured2 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured4 weeks ago
Soundarya: సౌందర్య చనిపోతుందని ఆ వ్యక్తికి ముందే తెలుసా… ఆమె మరణంలో కుట్ర జరిగిందా?
- Featured4 weeks ago
Manikanta: అలా మాట్లాడటం సరికాదు.. మణికంఠ భార్యకు మద్దతుగా నిలిచిన సోదరి!
- Featured4 weeks ago
Vadde Naveen: ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వడ్డే నవీన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు… ఎలా ఉన్నాడో తెలుసా?
- Featured4 weeks ago
Actress Rohini: కమిటీ సిద్ధం చేసాము…వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడొద్దు: రోహిణి
- Featured7 days ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
- Featured4 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ మణికంఠ భార్య ఎవరో తెలుసా… వైరల్ అవుతున్న పెళ్లి వీడియో!