Poonam Kaur: ఇది నిర్లక్ష్యమా… అహంకారమా పవన్ సినిమా పోస్టర్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్!

0
83

Poonam Kaur: వెండితెర సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి గుర్తింపు సంపాదించుకున్న దాని కన్నా సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటి పూనమ్ కౌర్. ఈమె హీరోయిన్ గా నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇతర సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తరచూ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.ఇలా పలు వివాదాస్పద పోస్టుల ద్వారా వార్తల్లో నిలిచే పూనమ్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పోస్టర్లు సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ కాళ్ల వద్ద ఉంది ఈ విషయంపై నటి పూనమ్ స్పందిస్తూ ఇది మీ అహంకారమా లేక నిర్లక్ష్యమా.భగత్ సింగ్ వంటి ఒక గొప్ప నాయకుడి పేరును ఇలా కాళ్ళ కింద పెట్టడం అంటే ఆ నాయకుడిని అవమానపరచడమే అంటూ ఈమె కామెంట్ చేశారు.

Poonam Kaur: కాళ్ళ కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటి…


ఈ విధంగా పూనమ్ కామెంట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అటెన్షన్ సీకర్ అంటూ ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసే ఫస్ట్ గ్లింప్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈమె ఈ సినిమా గురించి ఇలాంటి కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త డిస్టర్బ్ అయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం పూనమ్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.