నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే ట్వీట్స్ భారీ దుమారాన్ని లేపుతూ ఉంటాయి. ఈమె చేసే ట్వీట్స్ ప్రత్యేకించి ఒక్కరిని ఉద్దేశించి అని చెప్పలేను కానీ పరోక్షంగా ఆ ట్వీట్స్ ఎవరిని ఉద్దేశించి చెబుతుందో అందరికీ అర్థం అవుతాయి. మరి కొన్నిసార్లు అయితే పూనం చేసే ట్వీట్ లకు తలతోక ఉండదు. అవి ఎవరినీ ఉద్దేశించి చేసిందో అర్థం కాక నెటిజన్లు అయోమయంలో పడుతుంటారు.

ప్రస్తుతం అలాంటి తలతోక లేని ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. సాధారణంగా ఈ అమ్మడు చేసే ట్వీట్లు ఎక్కువగా పవన్ కళ్యాణ్ లేదా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఉంటాయి.ఎప్పుడు ఆ ఇద్దరినీ దృష్టిలో ఉంచుకొని ట్వీట్ చేస్తూ ఉంటారు.కానీ ఈసారి చేసిన ట్వీట్ మాత్రం ఎక్కడ ఒక హింట్ లేకుండా చేయడంతో నెటిజన్లు ఈమె ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేసిందో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు.
ఇంత కన్ఫ్యూజన్ గా పూనమ్ చేసిన ట్వీట్ ఏమిటంటే.. ఐడియాలను కాపీ చేస్తారు… మరొక వ్యక్తి ఇమేజ్ ను క్రియేట్ చేస్తుంటారు. ఆ వ్యక్తి నా కలలను కాదు కానీ.. నా ఐడియాలను లాగేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చాడు. నిన్ను క్షమించలేకతున్నాను. కాపీ మాస్టర్.. ఐడియాలు, లైఫ్ స్టైల్ అన్నింటినీ కాపీ చేసి నీకు ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడ వాడుతున్నావ్ అంటూ పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
పూనమ్ చేసిన ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించిదో అర్థం కాక తల పట్టుకున్నారు. మరికొందరు మాత్రం కామెంట్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అని కామెంట్ చేయగా, మరి కొందరు పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎక్కువ కామెంట్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు రావడం విశేషం. నిజానికి ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందో పూనమ్ కౌర్ చెబితే తప్ప క్లారిటీ రాదు































