Poorna : మళయాళి ముద్దుగుమ్మ పూర్ణ అసలు పేరు షమ్న ఖాసీం. తెలుగులో హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయకపోయినా చాలా కొద్ది సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పూర్ణ. శ్రీహరి గారితో కలిసి మహాలక్ష్మి అనే సినిమాలో మొదట నటించినా అల్లరి నరేష్ తో కలిసి నటించిన సీమ టపాకాయ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇక రవిబాబు అవును, ఓంకార్ రాజు గారి గది హార్రర్ సినిమాలతో ఆకట్టుకుంది. ఇటీవలే మళ్ళీ బాలకృష్ణ లెజెండ్ సినిమాతో మళ్ళీ చక్కటి పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది.

ఢీ షో నుండి తప్పుకున్న పూర్ణ…..

సినిమాలలో కంటే పూర్ణ టీవీ షోలతో బాగా బిజీ. అటు సినిమాలు చేస్తూనే ఇటు ఈటీవీలో ఢీ డాన్స్ షోకి జడ్జి గా అలాగే అపుడపుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక లపై సందడి చేస్తూ ఉండేది. చాలా కాలంగా ఢీ షోలో వన్ అఫ్ ది జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ ప్రస్తుతం గత కొన్నిరోజులుగా షోలో కనిపించడం లేదు. దీంతో అందరూ కారణం ఏమై ఉంటుందా అని సందేహిస్తున్నారు.

అయితే గత రెండు రోజులుగా పూర్ణ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు స్వయంగా పూర్ణ షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. దుబాయ్ వ్యాపారవేత్త అసిఫ్ ఆలీ ని పెళ్లి చేసుకోబోతోంది. జేబీఎస్ గ్రూప్ అధినేతగా అసిఫ్ కొన్ని వేల కోట్ల ఆస్తులతో లీడింగ్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్న పూర్ణ అందుకే షో నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూర్ణ చేతిలో తమిళ, తెలుగు, మలయాళం మూడింటిలో కలిపి ఏడు సినిమాలు ఉన్నాయి.

































