పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు హాజరై ఆ వేడుకల్లో భాగంగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వేడుకలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో పవన్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు ఘాటుగా స్పందిస్తూ తమదైన శైలిలో సమాధానం చెప్పారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ వ్యవహారంలోకి పోసాని కృష్ణ మురళి ఎంటర్ అయి పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ జగన్ కి మీకు పోలిక ఏంటి..ఆయనతో పోల్చుకునే స్థాయి మీది కాదు అంటూ పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. సాధారణంగా మీరు ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే వారి కళ్ళు పీకేస్తా అని చెబుతారు కదా.. మరి మన ఇండస్ట్రీలోనే ఒక అమ్మాయికి తీరని అన్యాయం జరిగింది. ఆ అమ్మాయికి న్యాయం చేయండి.ఆ అమ్మాయికి న్యాయం చేస్తే మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక పంజాబీ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు ఇప్పిస్తామని ఎన్నో ఆశలు చూపి ఆమెను శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేశారు. ఇదేంటని ఆ హీరోయిన్ తల్లిదండ్రులు ప్రశ్నిస్తే ఈ విషయం బయటకు రాకుండా ఉండటంకోసం వారికి ఐదు కోట్లు ఇచ్చి వారి నోళ్లు మూయించారు. మరి ఆ పంజాబీ హీరోయిన్ కు కడుపు చేసిన ఆ పవర్ఫుల్ హీరో ఎవరో నేను మీకు చెబుతాను తనకు న్యాయం చేయండి అంటూ పోసాని పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు.

ఇలా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై ఘాటుగా స్పందించడంతో అసలు ఆ పంజాబీ అమ్మాయి ఎవరు? తనను లొంగదీసుకున్న ఆ వ్యక్తి ఎవరు? అనే విషయం గురించి ప్రస్తుతం పెద్దఎత్తున చర్చలు మొదలు పెట్టారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారో కానీ అప్పటి నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.































