బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ భారీ షాక్.. ఇప్పట్లో అయితే కష్టమేనట..!!

0
80

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ మంచి వసూళ్లను సాధించింది..దీంతో పవన్ ఇప్పుడు మాంచి ఊపు మీద ఉన్నాడు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెంచాడు.. వకీల్ సాబ్ తర్వాత పవన్ వరుస సినిమాలతో బిజీగా మారనున్నాడు..పవన్ కళ్యాణ్ సినిమాల జాబితా ఇప్పటీకే లెక్కకి మించిపోయి ఉంటే..చివరి లెక్కగా తన సినిమా గురుంచి ఆలోచిస్తున్నాడు నిర్మాత బండ్ల గణేష్.. ఇప్పటికే పవన్ వెనుక నిర్మాతలు పెద్ద క్యూలో ఉన్నారు.

పైగా వాళ్ళు ఇప్పటి నిర్మాతలు కూడా కాదు, సీనియర్ మోస్ట్ నిర్మాతలు.మరి అలాంటి వాళ్ళకి పవన్ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయినా బండ్ల మాత్రం పవన్ తనకు డేట్స్ ఇస్తాడనే హాప్ తో ఉన్నాడు..కానీ తెలుస్తున్న దాని ప్రకారం బండ్ల గణేష్ కి ఎట్టిపరిస్థితుల్లో ‘పవన్ కళ్యాణ్’ ఇప్పట్లో డేట్స్ ఇవ్వడు అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్..ఇక రీఎంట్రీ తరువాత వచ్చిన వకీల్ సాబ్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో బండ్లకి మరింత ఆశ పెరిగిపోయింది.

ఎలాగైనా పవన్ తో మళ్ళీ ఒక సినిమా చేయాలని బండ్ల అమ్మవారికి తెగ పూజలు చేస్తున్నాడట. అయినా ఎన్ని చేస్తే ఏమి ఉపయోగం… ఎప్పుడో జమానా కాలం నాడే పవన్ కి అడ్వాన్స్ ఇచ్చి కూర్చింది మైత్రీ మూవీస్ సంస్థ.అందుకే ఈ సంస్థ తెలివిగా హరీష్ శంకర్ ను సెట్ చేసుకుంది. అతని డైరెక్షన్ లోనే ఇప్పుడు సినిమా చేయడానికి సన్నద్ధం అవుతుంది. పవన్ తరువాత సినిమా ఇదే. ఇక ఆ తరువాత జనసేనకు సేవలందించిన రామ్ తాళ్లూరి కోసం కూడా పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంది. పైగా రామ్ తాళ్లూరి అంటే పవన్ కి ప్రత్యేక అభిమానం ఉంది, కాబట్టి ఈ సినిమా పూర్తి అయ్యేవరకూ పవన్ బండ్లకి డేట్స్ ఇవ్వడు.

ఎలాగూ ఈ మధ్యలో అయ్యప్పన్ కోషియమ్ రీమేక్, అలాగే క్రిష్ సినిమాలు ఉన్నాయి. అలాగే వంశీ పైడిపల్లి – దిల్ రాజు – పవన్ కలయికలో మరో సినిమా ఉందని ఇప్పటికే గ్యాసిప్ లు కూడా మొదలైపోయాయి. ఈ సినిమాలు కాకుండా పవన్ – త్రివిక్రమ్ కలిసి పెట్టిన బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నాడు..మరి ఇవి పూర్తయ్యే దాకా బండ్ల గణేష్ వెయిట్ చేస్తాడా..?అసలు అప్పటికీ పవన్ బండ్ల కి చాన్స్ ఇస్తాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here