మరోసారి జక్కన్న దర్శకత్వంలో నటించబోతున్న బాహుబలి..?

0
90

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ సినిమా లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి కారణం రాజమౌళి. చత్రపతి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు ప్రభాస్. ఇక బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకొని ఉంటారు. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి, అలాగే ప్రభాస్ కు ఉన్న పరిస్థితుల్లో వీరి కలయికలో మరో సినిమా సాధ్యమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఈ సినిమా తరువాత మహేష్ బాబు సినిమా చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే ప్రభాస్ రెండు మూడు సినిమాల్లో నటిస్తూ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సలార్, రాధేశ్యామ్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలలో నటిస్తున్నాడు.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. ఇప్పుడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమాకు మాతృ సంస్థ యు.వి.క్రియేషన్స్ గోపీకృష్ణ మూవీస్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కానుందట. షూటింగ్ మాత్రం ప్రస్తుతం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తి కాగానే మొదలవుతుంది అంటున్నారు.