టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ గా పేరు పొందిన ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఎన్నో అద్బుతమైన సినిమాలు చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. మాస్, క్లాస్ అన్న బేధం లేకుండా ప్రతీ క్యారెక్టర్ లో ఒదిగిపోయే ప్రభాస్ కు అమ్మాయిల ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు పెళ్లి కాకుండా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ గా ఉన్న లిస్ట్ లో ప్రభాస్ ముందుంటారు.

ప్రభాస్ పెళ్లి గురించి ఏ మాత్రం గుసగుసలు వినిపించినా సోషల్ మీడియో ఓ రేంజ్ లో దూసుకుపోతుంటాయి. అలా తన అభిమాన నటుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని చూస్తుంటారు. అయితే ప్రభాస్ రియల్ జీవితంలో గతంలో ఓ హీరోయిన్ ను ప్రేమించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఆ హీరోయిన్ ఎవరంటే.. ప్రభాస్ తో మంచి హిట్ సినిమాల్లో నటించిన త్రిష. వర్షం సినిమా వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత బుజ్టిగాడు, పౌర్టమి వంటి సినిమాల్లో కూడా నటించారు. అయితే అదే సమయంలో ఈ జంట నిజజీవితంలో కూడా ప్రేమలో పడినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే వీళ్ల ప్రేమకు ఇండస్ట్రీలోని బడా పెద్దలు అడ్డు చెప్పారని.. అప్పట్లో వినిపించింది. అయితే ప్రభాస్, త్రిష ప్రేమ వ్యవహారం అప్పట్లో పెను సంచలనంగా మారాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనేది సినీ పెద్దలకే తెలియాలి.


































