Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆగస్టు నుంచి మారుతి డైరెక్షన్లో రాబోతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నారు.

తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ గురించి డైరెక్టర్ మారుతి కుమార్తె హియ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది అంతేకాకుండా అక్కడ ఉన్నవారికి కడుపునిండా వివిధ రకాల ఆహార పదార్థాలను తెప్పిస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు అనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే హియా సైతం ఒకరోజు చాక్లెట్ కోసం తన పక్కవారితో గొడవ పడ్డారట. ఈ విషయం ప్రభాస్ కి ఎలా తెలిసిందో తెలియదు కానీ తనకు మాత్రం కొద్దిసేపటికే ఒక ప్లేట్ నిండా వివిధ రకాల చాక్లెట్స్ తెప్పించారని హియా వెల్లడించారు. ఇలా చాక్లెట్స్ అన్ని తెప్పించి నీకు ఏది కావాలో తీసుకో అంటూ ప్రభాస్ తన ముందు పెట్టారని తెలిపారు.
ప్లేట్ నిండా చాక్లెట్స్..
తాను బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ గారికి వీరాభిమానిగా మారిపోయాను ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ రోజే చూడాల్సిందేనని హియా ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభాస్ తరువాతే ఎవరైనా అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.






























