Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతున్నాయి.

బాహుబలి సినిమా తర్వాత ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లెక్కన ఈయన ఈ సినిమాకు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఇలా ఒక్క సినిమాకు 100 కోట్ల పైన రెమ్యూనరేషన్ అందుకుంటున్న ప్రభాస్ ఆ రెమ్యూనరేషన్ మొత్తం ఏం చేస్తున్నారనే సందేహం ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అయితే ప్రభాస్ ఫుడ్ విషయంలో కాంప్రమైస్ కారనే విషయం మనకు తెలిసిందే. ఆయన ఎలా అయితే భోజనం చేస్తారో తన పక్కన ఉన్నవారు కూడా అలాగే భోజనం చేయాలని కోరుకుంటారు. ఇలా భోజనాల కోసమే ఈయన భారీ స్థాయిలో ఖర్చు చేస్తూ ఉన్నారు.
రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి..
ఇకపోతే తన రెమ్యూనరేషన్ సైతం రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ శివారులో భారీ స్థాయిలో ఫామ్ హౌస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫామ్ హౌస్ కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలా హైదరాబాదులో మాత్రమే కాకుండా ముంబై అలాగే లండన్ ఇటలీ వంటి విదేశాలలో కూడా ఈయనకు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రభాస్ తన రెమ్యూనరేషన్ మొత్తం చాలా తెలివిగా పెట్టుబడులలో పెడుతున్నారని తెలుస్తోంది.
































