Prabhas-Kriti Sanon: కొద్ది రోజుల నుంచి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బాలీవుడ్ బ్యూటి కృతి సనన్ పెళ్లి చేసుకోబోతున్నారని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా వీరి గురించి వార్తలు రావడం కాకుండా ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సందు ఈ విషయంపై స్పందిస్తూ త్వరలోనే వీరి నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారంటూ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే కృతి సనన్ ప్రభాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో అభిమానుల సైతం ఎంతో వ్యక్తం చేశారు. ఆది పురుష్ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ తనకు ప్రపోజ్ చేయడంతో తన ప్రపోజల్ కి కృతి సైతం పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అంటూ ఉమైర్ సందు చొపుకొచ్చారు.
ఇకపోతే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సైతం కృతి సనన్ ప్రభాస్ గుండెల్లో ఉందంటూ పరోక్షంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని హింట్ ఇచ్చారు.ఈ విధంగా ప్రభాస్ కృతి సనన్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలకు మరింత బలం రావడంతో ఇది నిజమేనని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి వార్తలపై తాజాగా నటి కృతి సనన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Prabhas-Kriti Sanon: ఆట పట్టించడం కోసమే అలా మాట్లాడారు…
ఈ సందర్భంగా కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వరుణ్ ధావన్ తనని ఆటపట్టించడం కోసమే అలాంటి మాటలు మాట్లాడారని, తన గురించి ప్రభాస్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఈ సందర్భంగా కృతి సనన్ ప్రభాస్ తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































