Prabhas Srinu: ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ శ్రీను అందరికి సుపరిచితమే.ఈయన ప్రభాస్ కి మంచి స్నేహితుడు కావడమే కాకుండా ఆయన ప్రతి ఒక్క సినిమాలలో కూడా నటించారు. ప్రభాస్ వల్ల తాను ఇండస్ట్రీలో ఉన్నానని ఈయన ఎన్నోసార్లు తెలియజేశారు.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి ప్రభాస్ శ్రీను పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ప్రభాస్ హీరో కాకముందు హీరో అయిన తర్వాత అలాగే పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత అతనిలో ఎలాంటి మార్పు లేదని ప్రభాస్ శ్రీను తెలిపారు.
అతని స్థాయి మారే కొద్దీ అతనిలో ఎలాంటి మార్పులు లేవని ఆయన అప్పటికి ఇప్పటికీ ఒకేలాగే ఉన్నారని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఇకపోతే ప్రభాస్ మంచితనం గురించి కూడా ఈయన చెబుతూ ఆయన మంచితనమే తనకు ప్లస్ మైనస్ అంటూ కామెంట్ చేశారు. ప్రభాస్ ప్రతి ఒక్కరితోనూ చాలా మంచిగా ఉంటారు. అయితే ఆయనకు ఎవరి మీదైనా కోపం వస్తే వారితో అస్సలు మాట్లాడరు.

Prabhas Srinu: అతని సైలెన్స్ భయంకరంగా ఉంటుంది…
ప్రభాస్ వీక్ నెస్ ఇదేనని ప్రభాస్ శ్రీను తెలిపారు. ఇక ఈయన నవ్వు ఎంత అందంగా ఉంటుందో ఆయనకు కోపం వస్తే ఆ సైలెన్స్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి ప్రభాస్ శ్రీను చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































