కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన పేరుతో కొత్త స్కీమ్ ను అమలు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. మధ్యలో చదువు మానేసిన వారికి కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం మొత్తం 300 కోర్సులను ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగుల కొరకు అందుబాటులోకి తీసుకురాగా నిరుద్యోగ అభ్యర్థులు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకుని చదువుకోవచ్చు.

కేంద్రం ఈ స్కీమ్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థులకు నైపుణ్యాలను నేర్పించడంతో పాటు ఉపాధిని కల్పిస్తోంది. 948 కోట్ల రూపాయలను కేంద్రం ఈ స్కీమ్ అమలు కొరకు కేటాయించడం గమనార్హం. 8 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందవచ్చని తెలుస్తోంది. కేంద్రం దరఖాస్తు చేసుకున్న యువతకు వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు యువతకు ఇష్టం ఉన్న రంగంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తారు.

https://pmkvyofficial.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకుని శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ సర్టిఫికెట్ ను పొందవచ్చు. డ్రాపౌట్స్, నిరుద్యోగులు ఈ స్కీమ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రాపౌట్స్, నిరుద్యోగులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. జిల్లాల్లో స్కిల్స్ కమిటీ ఏర్పాటు ద్వారా కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేయనుందని తెలుస్తోంది. వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here