మా ఎన్నిలకల హడావిడి ముగిసింది. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయినా కానీ మాలో మాత్రం వేడి తగ్గలేదు. పాతికేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 72 శాతం పోలింగ్ నమోదైంది. మంచు విష్ణుకు 381 రాగా సమీప ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. దీంతో మంచు విష్ణు 107 ఓట్లతో విజయ ధుంధుభి మోగించారు. ఇదంతా ఇలా ఉండగా.. విష్ణుతో కలిసి పనిచేయడం ఇష్టం లేదని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు 11 మంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇలా ప్రకాష్ రాజ్ తరఫున పోటీ చేసి గెలిచిన వారిలో శివారెడ్డి అత్యధికంగా 362 కోట్లు వచ్చాయి. అతడిని గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రాణ స్నేహితులు ఐదుగురు అని చెప్పాడు. వారి పేర్లు తిరుపతి, సునిల్, సదయ్య, తిరుమలా చారి, కనకపాలి అని చెప్పాడు. ఇందులో కోవిడ్ మహమ్మారికి తిరుమలా చారి చనిపోయాడని తెలిపాడు. చాలా బాధ కలిగిందిని.. చాలారోజుల వరకు అతడి పేరు తన నోటి నుంచి ఎప్పుడూ వచ్చేదిని తెలిపాడు.
వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కూడా అతడి ఆలోచనలు, గడిచిన సమయాలు గుర్తుకు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. స్నేహితులకు తాను ఎక్కువ వ్యాల్యూ ఇస్తానన్నాడు. హైదరాబాద్ కు వచ్చిన సమయంలో మరో స్నేహితుడు పరిచయం అయ్యాడని చెప్పాడు. శివారెడ్డి ఇల్లు కొనడానికి డబ్బులు సమకూర్చుకున్నాడు. 2002-2004 మధ్యలో ఇంటిని కొనడానికి తిరుగుతున్న క్రమంలో హైదరాబాద్ లో పరిచయమైన ఆ స్నేహితుడి సలహాలు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ఇలా ఓ రోజు తనకు అమెరికాలో ఓ ప్రోగ్రామ్ కు వెళ్లాల్సి వచ్చిందని.. అప్పడు తనకు పెళ్లి కాలేదు.. కనుక ఆ డబ్బులను ఆ స్నేహితుడి దగ్గర పెట్టమన్నాడు. అలానే అతడి వద్దే ఉంచి వెళ్లానని చెప్పాడు. కానీ ఆ స్నేహితుడు డబ్బులను వేరే పనులకు వాడుకున్నట్లు చెప్పాడు. ఇలా డబ్బులు ఇస్తాను.. అని చెప్పిన వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా అతడి ఫ్యామిలీతో సహా తనను మోసం చేసినట్లు చెప్పాడు.































