యంగ్ హీరోతో గృహలక్ష్మి ఫేమ్ లాస్య పెళ్లి చేసిన సుమ.. ఫోటోలు వైరల్!

0
381

ఒకప్పుడు యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా చేసిన తెలుగమ్మాయి ప్రశాంతికి అవకాశాలు తగ్గిపోవడంతో యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి పలు సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రశాంతి స్టార్ మాలో ప్రసారం కాబోయే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నటి ఒక సీరియల్ హీరోను వివాహం చేసుకున్నారు. అయితే ఈమె వివాహ సంగతులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ ఈ వారం కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ వారం పవన్ – అంజలి, విశ్వ -ప్రశాంతి, సన్నీ -శిరీష, వాసుదేవ్ -కరుణ జంటలుగా వచ్చారు. నాలుగు జంటలు క్యాష్ ప్రోగ్రాంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సుమ వేసే పంచులకు తమదైన శైలిలో సమాధానాలు చెబుతూ కార్యక్రమం మొత్తం ఎంతో సందడి చేశారు.

ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో ప్రశాంతి ఎంతో హైలెట్ అయ్యారు. ఓ సందర్భంలో సుమ ప్రశాంతిని నీ బాయ్ ఫ్రెండ్ ను ఎంతకాలం దాచి పెట్టావు.. అని అడగగా అందుకు ప్రశాంతి దాచిపెట్టి పంపించిన బాయ్ ఫ్రెండా… లేక దాచుకున్న బాయ్ ఫ్రెండ్ అంటూ సుమకు పంచులు వేసింది. ఈ క్రమంలోనే ఈ షోలో పాల్గొన్న జంటలకు సుమ దండలు మార్పించి ఉత్తుత్తిగా పెళ్లి చేసింది.

ఈ క్రమంలోనే యాంకర్ ప్రశాంతికి సీరియల్ హీరో విశ్వ ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉండగా మరొక సెలబ్రిటీ పెళ్లి ఫోటోలు తీసింది. ఈ విధంగా దండలు మార్చుకున్న తర్వాత ప్రశాంతి, విశ్వ సుమ కాళ్లకు నమస్కారం చేసుకున్నారు. ఇలా ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా సాగిపోయింది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.