దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో బ్యాంకు కస్టమర్లకు షాకింగ్ న్యూస్ తెలియజేసింది. ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితులలో బ్యాంక్ పలు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల దీని ప్రభావం బ్యాంక్ అకౌంట్ కలిగిన కస్టమర్ల పై పడనుంది.

తాజాగా ఈ యాక్సిస్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో నెలలో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండని వారిపై ఇక నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మే నెల 1వ తేదీ నుంచి మినిమమ్ బ్యాలెన్స్ 15000 ఉండాలి. అదే విధంగాప్రైమ్, లిబర్టీ సేవింగ్స్ ఖాతాలు కలిగిన వారు రూ.25,రూ.15 వేలు మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.

యాక్సిస్ బ్యాంకు కస్టమర్లు మే నెల 1వ తేదీ నుంచి మినిమమ్ బ్యాలెన్స్ అకౌంట్లు లేకపోతే రూ.10 నుంచి రూ.100 వరకు చార్జీ పడుతుంది. బ్యాంక్ మినిమమ్ ఛార్జ్ 150 నుంచి 50 కి తగ్గించి అదే సమయంలోనే గరిష్టంగా 600 నుంచి 800 పెంచింది. ఈ విధంగా యాక్సిస్ బ్యాంక్ ఉన్నఫలంగా ఛార్జీలు పెంచుతూ కస్టమర్లకు ఝలక్ ఇచ్చారు.

పొరపాటున మే 1 నుంచి మినిమమ్ బ్యాలెన్స్ 5 వేల నుంచి 7 వేల వరకు ఉంటే బ్యాంకు రూ.800 ఛార్జ్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇతర ప్రైవేటు బ్యాంకులైనహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ చార్జీల కన్నా యాక్సిస్ బ్యాంక్ అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేయడం గమనార్హం.ఇకపై కస్టమర్లు ఎంతో జాగ్రత్త పడుతూ నెలనెలా మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉండేవిధంగా చూసుకోవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here