బాలీవుడ్ బ్యూటీ, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేయించుకుంది. నేడు ప్రియాంక చోప్రా పుట్టినరోజు కావడంతో ఆమెకు నెటిజన్లు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా తెలుగులో కూడా ఓ సినిమాలో నటించారు. తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జతకట్టింది. వీరిద్దరూ జంటగా నటించిన “తుఫాన్” సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా కొన్ని సంవత్సరాలుగా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి వివాహం తరువాత ప్రియాంక చోప్రా అమెరికాలో స్థిరపడ్డారు.ఈ క్రమంలోని ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీకి స్వస్తి పలుకుతూ హాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్నారు. నేడు ఈమె పుట్టినరోజు కావడంతో ప్రియాంక అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.































