Priyanka Singh: తెలుగులో ఎక్కువగా పాపులారిటీ సంపాధించిన రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి. పాపులరిటీతో పాటుగా వివాదాలను కూడా మూటగట్టుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 5 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే.

2021 సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా.. ఇది మొదలు పెట్టిన రోజు నుంచే దీనిపై విమర్శలు వచ్చాయి. సీపీఐ నేత నారాయణ ఇది బిగ్ బాస్ షో కాదు అని.. బ్రోతల్ షో అని.. నాగార్జునపై కూడా ఫైర్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఏదేమైనా.. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన వారికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో అయితే విపరీతంగా ఫాలోవర్స్ వచ్చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఎవరంటే ప్రియాంకా సింగ్.
వావ్.. వాట్ ఏ ఎక్స్ ప్రెషన్స్..
జబర్దస్త్ లో సాయిగా ఎంట్రీ ఇచ్చి.. కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత అతడు అమ్మాయిగా సర్జరీ చేయించుకొని.. ప్రియాంక సింగ్ గా (పింకీ)మారాడు. తర్వాత కూడా జబర్దస్త్ లేడీ గెటప్ తో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం అదే ఫేమ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 5లో 9వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన పింకీ.. అంత కంటే ఎక్కువగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ అప్ డేట్స్ ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది ప్రియాంక. అందులో‘‘ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యో’’ అనే సాంగ్ తమిళ వర్సెన్ కు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు వావ్ వాట్ ఏ ఎక్స్ ప్రెషన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో ప్రియాంక సింగ్ తన అందాలను కాస్త ఎక్కువగానే చూపించదని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

































