Priyanka Singh : జబర్దస్త్, యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు పొందారు ప్రియాంక సింగ్. అయితే గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో తన అందంతో అభినయంతో ప్రేక్షకుల మనసు దోచింది ఈ అమ్మడు. తాజాగా మరో అవకాశాన్ని అందుకున్నారు ప్రియాంక సింగ్.

ప్రియాంక సింగ్ అసలు పేరు సాయితేజ్. జబర్దస్త్ షోలో కమెడీయన్‌గా లేడీ గెటప్స్ తో ఆకట్టుకున్న సాయితేజ లింగ మార్పిడి చేయించుకొని తన పేరుని ప్రియాంక సింగ్ మార్చుకున్నారు. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 5 షోలో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది ఈ భామ.

బిగ్ బాస్ 5 లో మానస్ తో పింకీ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. హౌజ్‌లో మానస్ వెంట పడటం పట్ల సోషల్ మీడియాలో పింకీ పై విమర్శలు వచ్చాయి. కానీ ఒక ట్రాన్స్ జెండర్ గా పింకీ ప్రవర్తనకు మంచి మార్కులే పడ్డాయి అనే చెప్పాలి. తనదైన ఆటతో బిగ్ బాస్ టాప్ 7 లో నిలిచింది.
మూవీ ఆఫర్ అందుకున్న ప్రియాంక సింగ్…
ప్రస్తుతం ఒక సినిమాలు నటించేందుకు ఆఫర్ అందుకుంటున్నారు ప్రియాంక సింగ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. కోన వెంకట్‌తో దిగిన ఫోటోని పంచుకుంటూ, త్వరలో ఓ ఎగ్జైట్‌మెంట్‌తో రాబోతున్నా… కోన వెంకట్‌తో టైమ్ స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అని రాసుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మాత్రం ప్రకటించలేదు ప్రియాంక సింగ్. అయితే త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది.





























