Producer Allu Aravind : తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే అల్లు కుటుంబం నందమూరి కుటుంబాల మధ్య సన్నిహిత సబంధాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోను భారీ ఎత్తున ప్లాన్ చేసి ప్రమోషన్స్ కూడా గట్టిగానే నిర్వహించారు. ఈ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అన్‌స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ, అల్లు అరవింద్ మధ్య బాండింగ్ మరింత పెరిగింది.
నిజానికి అంతకుముందు నుంచే ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. కాకపోతే ఇది బయట ప్రపంచానికి తెలియడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వస్తుంది అంటే అది ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం కలిగించాడు అల్లు అరవింద్.
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. కేవలం అల్లు అరవింద్ పై ఉన్న గౌరవం… ఆ కాన్సెప్ట్ పై ఉన్న నమ్మకంతో యాంకర్‌గా మారిపోయాడు బాలకృష్ణ. ఈ స్నేహంతోనే త్వరలోనే ఈయన గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య కోసం ఓ కథ కూడా లాక్ చేసాడు అల్లు అరవింద్.
ఆ డైరెక్టర్ తో బాలయ్య మూవీకి అల్లు అరవింద్ ప్లాన్ ?
కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న మల్లిడి వశిష్ట్… చెప్పిన కథ నచ్చి ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అరవింద్. అవినీతి రహిత సమాజం కోసం పోరాడే ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఇందులో బాలయ్య పర్‌ఫెక్ట్ గా సరిపోతాడని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ కాంబినేషన్‌లో రాబోయే మొదటి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.































