Producer Chittibabu : తారక రత్నకు ఆ అలవాటు ఉంది… గుండె పోటుకు కారణం అదే…: నిర్మాత చిట్టిబాబు

0
1563

Producer Chittibabu : ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన ఎన్టీఆర్ కుమారుడు మోహన కృష్ణ తనయుడు తారక రత్న ఒకేసారి తొమ్మిది సినిమాలను ఒప్పుకుని అప్పట్లో రికార్డు సృష్టించాడు. అయితే మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు పర్వాలేదనిపించినా మిగిలిన సినిమాలు ఎపుడు వచ్చాయో ఎపుడు పోయాయో కూడా తెలియకుండా వెళ్లిపోయాయి. మళ్ళీ చాలా రోజులకు వెబ్ సిరీస్ తో అలరించిన తారక రత్న ఈసారి సినిమాతో కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్పీచులతో ఆకట్టుకున్నాడు. అయితే కుప్పంలో తాజాగా లోకేష్ తో కలిసి పాదయాత్రలో కలిసి వెళ్తోండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బెంగళూరు తరలించగా గుండె పనిచేయడం ఆగిపోవడంతో ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇక ఆయనకు గుండె పోటు రావడానికి గల కారణాలను వివరించారు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు.

ఆ అలవాటే గుండె పోటుకు కారణం…

తారక రత్న లోకేష్ పాదయాత్ర కోసం కుప్పం వచ్చి అతనితో కలిసి పాదయాత్ర చేస్తున్న సందర్బంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్ తరలించినా గుండె పోటు వచ్చిందని తెలియడంతో బెంగళూరుకి తీసుకెళ్లి అక్కడ నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి ఇప్పటికీ క్రిటికల్ గానే ఉది. ఇక తారక రత్న కు సిగరెట్లు బాగా కాల్చే అలవాటు ఉంది అందుకే ఇలా గుండె పోటు వచ్చింది నటి చిట్టి బాబు మాట్లాడారు.

రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడటానికి కారణం అదే అంటూ చెప్పారు. ఇక తనకు అరుదైన మెలినా అనే వ్యాది ఉండటం వలన స్టంట్ వేయలేక పోతున్నారని, కోలుకుని మళ్ళీ తిరిగి రావాలంటూ చిట్టిబాబు అభిప్రాయాపడారు. ఇక పాదయాత్ర, మొదలగు సభలు చేసేటపుడు ఇరుకు సందులను కాకుండా ర్యాలీలు కొంచెం విశాలంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగవు అంటూ రాజకీయ పార్టీలకు సూచించారు చిట్టిబాబు.