Jr NTR: ఇండస్ట్రీ అన్న తర్వాత నటీనటులకు దర్శకనిర్మాతలకు హిట్లు ప్లాపులు రావడం సర్వసాధారణం. ఇలా అనుకోకుండా కొన్నిసార్లు అద్భుతమైన విజయాలను అందుకొని దూసుకుపోతున్న నిర్మాతలు సైతం కొన్నిసార్లు ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొని ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఈ విధంగా తాను కూడా ఇండస్ట్రీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని తాజాగా నిర్మాత అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ప్రొడ్యూసర్ గా అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు నిర్మించారు. తాజాగా ఈ నిర్మాణంలో సీతారామం అనే సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిర్మాత అశ్వినీ దత్ సైతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేసి తాను ఊరు వదిలి వెళ్లిపోయిన పరిస్థితి వచ్చిందని ఈ సినిమాతో తాను ఇండస్ట్రీ జోలికి వెళ్లకూడదని భావించానని ఈయన తెలిపారు. 2011 వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరికెక్కిన సినిమా శక్తి.
హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాను…
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ కేవలం 50 శాతం వసూళ్లను కూడా వెనక్కి రాబట్ట లేకపోయింది.ఈ సినిమా ద్వారా ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్న తాను హైదరాబాద్ వదిలి విజయవాడ వెళ్ళిపోయానని అయితే అదృష్టవశాత్తు అప్పుడు తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటం వల్ల ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని అశ్వినీ దత్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో ఇండస్ట్రీ జోలికి రాకూడదని భావించాను కానీ నా అశ్విన్ జాతి రత్నాలు మహానటి వంటి సినిమాలతో నన్ను నిలబెట్టారని ఈ సినిమాలతో కాస్త లబ్ధి పొందానని ఈ సందర్భంగా ఈయన పేర్కొన్నారు. ఇలా ఎన్టీఆర్ సినిమా గురించి అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































