కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పటికి కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు, అభిమానులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ కుమార్ మాట్లాడిన మాటలు, చేసిన డాన్సులు ఇలా ప్రతి ఒక్కటి కూడా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఫిట్ గా ఉండి, ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించే పునీత్ ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో సినీ పరిశ్రమ ఒక్క సారిగా షాక్ కు గురయింది.

పునీత్ మరణవార్తతో కొందరు అభిమానుల గుండెలు కూడా ఆగిపోయాయి. ఆయన జిమ్ లో ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో గుండెలో నొప్పి రావడం, వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించడం,సీరియస్ గా ఉందని ఐసీయూ కి షిఫ్ట్ చేయడం, చికిత్స అంధిస్తున్న క్రమంలోనే తుది శ్వాస విడచడం, ఇవన్నీ కూడా ఊహించని విధంగా జరిగిపోయాయి.
పునీత్ చివరి క్షణాల్లో రికార్డ్ అయిన సీసీటీవీ పుటేజ్ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వారి ఇంటి నుంచి కారు వరకు తాను స్వయంగా నడుచుకుంటూ వెళ్లి పెట్టినట్టుగా కనిపిస్తోంది. తనకు ఏమీ కాలేదని ఇలాంటి నొప్పి రాలేదని చెప్పిన తర్వాత, అనంతరం కాల్ ఎత్తాక వెంటనే తన భార్య ఒడిలో పునీత్ పడుకున్నారు.
పునీత్ మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మూగబోయింది. పునీత్ ని చివరిసారిగా చూసేందుకు దాదాపుగా 10 లక్షల మంది అభిమానులు కంఠీరవ స్టేడియంకి వచ్చినట్టుగా పోలీసులు అంచనా వేశారు. అలాగే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలు కూడా బెంగుళూరుకి వెళ్లి పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించిన విషయం తెలిసిందే. మొత్తానికి పునీత్ అకాల మరణం కర్ణాటక చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.































