పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఎంతో మందికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆయన మరణంతో అభిమానులు సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి లేని ట్రాక్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా అతను నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం. రాజ్ కుమార్ నటించిన 29 సినిమాలలో అత్యధికంగా సినిమాలు సూపర్ హిట్లూ, బ్లాక్ బాస్టర్ హిట్లు అయ్యాయి.

తన కెరీర్లో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే అతను నిరాశ కలిగించాయి. పునీత్ రాజ్ కుమార్ కెరీర్ ఆరంభంలోనే వరుసగా 11 చిత్రాలు సూపర్ హిట్ కావడం విశేషం. సౌత్ ఇండియాలోనే ఏ హీరోకి లేదనే చెప్పాలి. పునీత్ రాజ్ కుమార్ విజయంలో ఎక్కువగా తెలుగు వాళ్ళ పాత్ర ఉంది.పునీత్ మొదటి సినిమా నుంచి పవర్ స్టార్ అనే బిరుదు వచ్చే వరకు తెలుగు సినిమా దర్శకులు రచయితలు పాత్ర ఉండటం విశేషం.
అంతే కాకుండా తన తండ్రి దివంగత నటుడు రాజకుమార్ కోరికమేరకు మొదటి సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించారు. అలా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు పునీత్ రాజ్ కుమార్. ఆ సినిమా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమాకు మాత్రుక కావడం గమనార్హం.
మొత్తంగా పునీత్ రాజ్ కుమార్ నటించిన 29 చిత్రాలలో 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 11 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే 5 సినిమాలు యావరేజ్ గానూ, మిగతా నాలుగు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఇలా తన కెరీర్లో మొత్తంగా 87 శాతం సక్సెస్ గ్రాఫ్ పునీత్ రాజ్ కుమార్ సొంతం చేసుకున్నాడు. కోట్లాదిమంది ప్రేక్షకుల ప్రేక్షకాదరణ పొందిన పునీత్ కుమార్ ఇలా ఒక్కసారిగా అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది.































