దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కొత్త చట్టాలు అమలు చేస్తున్నా ఈ ఘటనల సంఖ్య తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. అయితే అత్యాచార ఘటనలకు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా శిక్షలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అత్యాచార కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు విధిస్తారు. మన దేశంలో అత్యాచారం కేసుకు 14 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది.

ఫ్రాన్స్ దేశంలో అత్యాచార ఘటనలకు 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఉత్తరకొరియా దేశంలో రేప్ కేసులో దోషులను కాల్చి చంపుతారు. రష్యాలో అత్యాచార కేసులలో మూడు సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. అమెరికాలో రాష్ట్రాలను బట్టి శిక్షల్లో మార్పులు ఉంటాయి. వీలైతే జైలు శిక్ష, లేకపోతే జీవితకాల శిక్ష విధిస్తారు. ఇజ్రాయెల్ లో అత్యాచారం చేసినట్టు నిర్ధారణ అయితే 16 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు.

ఈజిఫ్ట్ లో రేప్ కేసులకు ఉరిశిక్షను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇరాన్ లో అత్యాచార కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధిస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే సౌదీ అరేబియా దేశంలో రేప్ కేసులలో నిందితులకు బహిరంగంగా తల నరకడం చేస్తారు. చైనాలో కొన్నిసార్లు మరణశిక్ష లేదా బతికి ఉండగానే నరకం అనుభవించేలా ఎవరికీ చెప్పలేనటువంటి శిక్షలను విధిస్తారు. ఆప్ఘనిస్తాన్ లో ఉరిశిక్ష వేయడం లేదా కాల్చి చంపడం చేస్తారు.

ఇలా రేప్ కేసుల్లో దోషులకు ఒక్కో దేశంలో ఒక్కో శిక్ష విధిస్తారు. కొన్ని సందర్భాల్లో చేసిన నేరాన్ని బట్టి ఇంకా కఠినంగా శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా అత్యాచార ఘటనలను తగ్గించడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here