ఎంతో అందంగా సాగిపోతున్న కుటుంబంలో కొన్ని మనస్పర్థలు తలెత్తేడం వల్ల గత నాలుగు సంవత్సరాల నుంచి తన భర్తకు దూరంగా ఉంటుందో మహిళ. అయితే ఈ క్రమంలోనే తనకంటే చిన్న వయసు యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన కూతురితో కలిసి ఆ యువకుడితో ఆ తల్లి కలిసే ఉంది.తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా తన కూతురుపై కూడా ఆ ప్రబుద్ధుడు కన్నేశాడు.ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లి యువకుడి పై పోలీస్ కేసుపెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ సంగూర్ జిల్లాకు చెందిన మహిళకు 2000 సంవత్సరంలో పెళ్లయింది.కొన్ని కుటుంబ కలహాల కారణాలవల్ల తన భర్త నుంచి గత నాలుగు సంవత్సరాలుగా విడిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ తల్లి మరొక యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.తన 14 సంవత్సరాల కూతురుని తీసుకొని అతనితోనే సహజీవనం చేస్తోంది. అయితే ఆ యువకుడు తన తల్లితో పాటు కూతురుపై కూడా కన్నేశాడు.
తల్లి ఇంట్లో లేని సమయంలో కూతురిపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వంటరిగా దొరికితే లైంగిక వాంఛలు తీర్చుకునే వాడు.ఈ విషయం తెలిసిన తల్లి భర్త లేని తనకు తోడుగా ఉంటాడని భావిస్తే, ఆ యువకుడు తన కూతురి పట్ల ఈ విధంగా ప్రవర్తించడంతో ఆ తల్లి నిర్ఘాంతపోయి అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన కూతురి పట్ల ఈ విధంగా ప్రవర్తించిన తీరును ఏంటి అని ప్రశ్నిస్తే తనని చితకబాదేవాడని, ఆమె పోలీసుల ఎదుట తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై అత్యాచారం, పోక్సో, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని, బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.






























