Puri Jagannath: సినిమాలలోకి రాకముందు పూరి జగన్నాథ్ అలాంటి పనులు చేసారా… 50 రూపాయలు మాత్రమే ఇచ్చేవారా?

0
36

Puri Jagannath: టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూరి జగన్నా థ్ ఒకరు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ కలిగినటువంటి ఈయన ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఇలా దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయనకు గత ఏడాది లైగర్ అనే సినిమా భారీ డిజాస్టర్ అందించింది.

ఈ డిజాస్టర్ సినిమా నుంచి బయటపడటం కోసం పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సినిమాలలో రాకముందు తాను చేసే పనుల గురించి తెలియజేశారు. తను ఇండస్ట్రీలో డైరెక్టర్ గా రాకముందు కథలను రాస్తూ కొందరు దర్శకులకు ఇచ్చేవాడిని.

నేను రాసే కథ ఆధారంగా ఆ కథకు వంద నుంచి ₹1000 వరకు నాకు రెమ్యూనరేషన్ ఇచ్చే వారిని తెలిపారు.ఇలా నేను రాసిన కథలతో సినిమాలు చూసి ఎంతోమంది మంచి సక్సెస్ అందుకున్నారని అయితే ఆ సినిమా సక్సెస్ ఆ డైరెక్టర్ల ఖాతాలోకి వెళ్లిపోయవని పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఇలా కథలను రాయడమే కాకుండా చిన్న చిన్న సీన్లకు దర్శకత్వం వహిస్తూ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Puri Jagannath: మ్యాగజైన్ కోసం బొమ్మలు గీసే వాడిని…


ఇలా సినిమాకు కథలను అందించడమే కాకుండా ప్రముఖ మ్యాగ్జిన్ ప్రింట్ చేసే యానిమేటెడ్ షార్ట్ స్టోరీకి బొమ్మలు కూడా గీసి ఇచ్చేవాడిని దీనికోసం వారానికి 50 రూపాయలు మాత్రమే ఇచ్చేవారనీ తెలిపారు. ఇలా వారానికి 50 వంద రూపాయల కోసం తాను ఎన్నో పనులు చేశాను అంటూ ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.