Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప.ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రావడమే కాకుండా హీరో హీరోయిన్లకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రమైనటువంటి పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందని అభిమానులు ఆత్రుత కనపరచడమే కాకుండా ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ డైలాగ్ లీక్ అవడంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక ఈ డైలాగ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అభిమానులు కొంతమేర ఆందోళన చెందినప్పటికీ ఈ డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 నుంచి లీక్ అయిన డైలాగ్ ఏంటి అనే విషయానికి వస్తే… అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేస్తే పులి వచ్చిందని అర్థం… అదే పులి నాలుగడుగులు వెనక్కి వేస్తే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం.. నీ యవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ లీక్ అయింది.

Pushpa 2: లీక్ అయిన డైలాగులతో సినిమాపై పెరిగిన అంచనాలు…
ఈ విధంగా చాలా లెంతీ డైలాగ్ లీక్ అవ్వడమే కాకుండా
వాళ్ళు గొర్రెలను కాయడానికి వచ్చారు.. ఆ గొర్రెలను తినడానికి నేను వచ్చాను అంటూ పుష్పరాజ్ బేస్ వాయిస్ తో చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా పుష్ప 2 లో పుష్ప సినిమాను మించిన డైలాగ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ డైలాగ్స్ విన్న తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
































