Pushpa 2: ఏపీలో పుష్ప సినిమా విషయంలో వైకాపా వర్సెస్ టీడీపీ అనే విధంగా వివాదం కొనసాగుతుంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఈ సినిమా గురించి నెగటివ్ ప్రచారాలు చేస్తూ ఉండగా మరికొంతమంది వైకాపా అభిమానులు మాత్రం ఈ సినిమాకు పూర్తిస్థాయిలో మద్దతు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ గతంలో వైకాపా పార్టీకి మద్దతు తెలపడంతో ఇప్పుడు ఈ సినిమాకు వైకాపా అభిమానుల మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తుంది.

ఈ క్రమంలోనే ఏపీలో కొన్ని థియేటర్లలో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున తమ పార్టీ జెండాలతో సందడి చేశారు.అలాగే థియేటర్లో బయట జగన్మోహన్ రెడ్డితో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడంతో టీడీపీ కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో టిడిపి అభిమానులు అలాగే వైకాపా అభిమానుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్నాయి.

Pushpa 2: కర్రలతో దాడి..
తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమాకు సపోర్టుగా వైసీపీ నేతల ఫ్లెక్సీలు వెలిశాయి. బన్నీతో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా టిడిపి నేతలు అభ్యంతరం చెప్పడంతో ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలోనే ఇరువురు కర్రలతో అలాగే రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో కొంతమందికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది.































