Pushpa Movie: అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.

ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కు కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక పుష్ప సినిమా చూసిన ఎంతోమంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. అయితే తాజాగా సీనియర్ నటి విజయలక్ష్మి ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయలక్ష్మి తన బాల్యం గురించి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తనని ఎప్పుడు కోడలా కోడలా అంటూ పిలిచేవారని ఈమె అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమా ఏది అని ప్రశ్నించారు.

Pushpa Movie:
ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ పుష్ప సినిమా చూశానని తెలిపారు. మరి అందులో నటించిన హీరో ఎవరు అని ప్రశ్నించగా సినిమా చూశాను కానీ అందులో ఉన్న హీరో ఎవరో నాకు తెలియదు అంటూ ఈమె వెల్లడించారు.అయితే ఇలా విజయలక్ష్మి సమాధానం చెప్పడంతో పుష్ప సినిమాలో నటించింది మరి ఎవరో కాదు మీ సినిమాలలో మీ సహనటుడిగా నటించిన అల్లు రామలింగయ్య గారి మనవడు అంటూ అని చెప్పుకొచ్చారు.ఈ మాటలు విన్న అనంతరం విజయలక్ష్మి ఈ మధ్యకాలంలో ఏ హీరోలు చూసిన రామానాయుడు మనవడు నాగేశ్వరరావు మనవడు ఎన్టీఆర్ మనవడు అంటూ చెబుతున్నారని విజయలక్ష్మి సమాధానం చెప్పారు.అయితే అల్లు అర్జున్ గురించి తన సినిమా గురించి విజయలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































