Radha Krishna : హను రాఘవపూడి… ‘అందాల రాక్షసి’ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన మంచి పేరు సంపాదించాడు. తరువాత నాని హీరోగా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఇపుడు తాజాగా మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన సినిమా ‘సీతారామం’. ఆగష్టు 5న భారీ తారగణం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఒక అద్భుత ప్రేమ కథ ఒకవైపు, డైరెక్టర్ తెరకెక్కించిన తీరు ఒకవైపు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాను మరో లెవల్కు తీసుకుపోయింది. ఈ సినిమా విజయం అటుంచితే ‘రాధే శ్యామ్’ దర్శకుడు ఈ సినిమా కారణంగా ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నాడు.

హను రాఘవపూడిని చూపిస్తూ రాధాకృష్ణను తిట్టిపోస్తున్న నెటిజన్లు…
ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా దాదాపు 300కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం రాధే శ్యామ్ కి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఇపుడు అభిమానులు ఇండియన్ టైటానిక్ తీస్తానంటూ.. మునిగిపోయే సినిమా చేశారని ప్రభాస్ అభిమానులు రాధాకృష్ణపై మండిపడుతున్నారు. ‘సీతా రామం’ విజయంతో హను రాఘవపూడిని చూపిస్తూ రాధాకృష్ణని తిడుతున్నారు. బడ్జెట్ మీద పెట్టిన ద్రుష్టి కాస్త స్టోరీ మీద ఉంటే విజయం సాధించేది అని కామెంట్స్ చేస్తున్నారు.

హను రాఘవపూడి, రాధాకృష్ణ ల ఇద్దరి గురువు చంద్రశేఖర్ ఏలేటి కావడంతో… హను రాఘవపూడి గురువు పేరు నిలబెడితే, రాధాకృష ప్రభాస్ పూజలను పెట్టి చిల్లర లవ్ స్టోరీ తీసి గురువు పేరు చెడగొడుతున్నాడు అని అంటున్నారు. అంతేకాకుండా తక్కువ బడ్జెట్లో ఒక మంచి లవ్ స్టోరీ తీయడం ఎలాగో హను రాఘవపూడి దగ్గర నేర్చుకోమని సలహా కూడా ఇస్తున్నారు.































