Raghava Lawrence:తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో కూడా ఈయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ నిజజీవితంలో కూడా హీరోగా మంచి గుర్తింపు పొందారు.

ఇప్పటికే ఈయన రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా చదువులు చదివించడమే కాకుండా హార్ట్ సర్జరీలు కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.తాజాగా రాఘవ లారెన్స్ ఏకంగా 150 మంది చిన్నారులను దత్తత తీసుకొని వారి చదువులు ఇతర బాధ్యతలు అన్ని తనవేనని తెలియజేశారు.
ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈయన ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక ఈ పిల్లలకు అభిమానుల ఆశీస్సులు కావాలని ఈయన ఆకాంక్షించారు. లారెన్స్ నటించిన రుద్రన్ తెలుగులో ఈ సినిమా రుద్రుడు పేరుతో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా లారెన్స్ ఈ విషయాన్ని తెలియజేశారు.

Raghava Lawrence: స్వామివారే ముందుకు నడిపిస్తున్నారు…
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు.. కేవలం తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలన్న తన తల్లి చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. అందుకే తాను నిజ జీవితంలో కూడా ఎంతోమంది చిన్నారులకు ఆసరాగా నిలబడ్డారని తెలుస్తోంది. ఇలా ఈయన 150 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారని తెలియడంతో నేటిజన్స్ ఈయన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
I’m extremely happy to share the news of adopting 150 children and provide them with education as a new venture from rudhran audio launch. I need all your blessings #Serviceisgod ???????? pic.twitter.com/lSwns10Grs
— Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2023
































