Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ సినిమాలోని నాటునాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాల ట్రెండు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఒక సినిమా హిట్ అయింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ గురించి గతంలో రాజమౌళి స్పందించారు. అయితే తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన మరోసారి సీక్వెల్ సినిమా గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తనకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎంతో ప్రోత్సాహకరంగా మారిందని తెలియజేశారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ సంపాదించుకున్నప్పుడు సీక్వెల్ గురించి ఆలోచించాము. అప్పుడు మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ స్పష్టంగా లేవు.

Rajamouli: స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్న విజయేంద్రప్రసాద్…
ఇక ఈ సినిమా విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ విషయం గురించి కీరవాణి నాన్నతో కలిసి మాట్లాడే సమయంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నాన్నగారికి చెప్పి వెంటనే స్క్రిప్ట్ పూర్తి చేయమని చెప్పాము అయితే స్క్రిప్ట్ పూర్తి అయ్యేవరకు సినిమాని ముందుకు తీసుకెళ్లలేమని రాజమౌళి తెలిపారు. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి అయితే సీక్వెల్ కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































