RRR MOVIE: సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద దర్శకుడు అయినా కొన్ని కొన్ని సార్లు కాపీ అన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే సినిమాలలో మంచి మంచి సన్నివేశాలను అద్భుతమైన పాటలను తెరకెక్కించినప్పుడు ఏదో ఒక సందర్భంలో ఇతర భాషల సినిమాలోని సన్నివేశాలతో అనుకోకుండా సింక్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కాపీ అన్న ముద్ర వేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ కాపీ అన్న ఆరోపణలు దర్శకుడు రాజమౌళి సినిమా విషయంలో కూడా వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల ఫై కాపీ అన్న ఆరోపణలు వినిపించాయి, వినిపిస్తున్నాయి. అయితే కేవలం ఈ సినిమా విషయంలో కాకుండా గతంలో తెరకెక్కించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలలో కాఫీ అన్న ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా కాపీ అన్నా పదం వెంటాడుతోంది.

ఇదే విషయం గురించి పెద్ద సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి చిందులు వేసిన నాటు నాటు సాంగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ పాటలో స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా ఈ పాట ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఇకపోతే ఈ పాటలోని స్టెప్పులు కొందరు కాఫీ అని అంటున్నారు.
హాలీవుడ్ కమెడియన్స్…
బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి హాలీవుడ్ కమెడియన్స్ వేసిన స్టెప్స్ తాజాగా చెర్రీ,తారక్ లు వేసిన స్టెప్స్ మ్యాచ్ అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే సదరు వీడియోకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ రాజమౌళి బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి స్టెప్పులను కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటకి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కి రాజమౌళి సూచనలు చేసి ఉంటారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని రాజమౌళి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని మరొక వర్గం వారు వాదిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం పాటలో ఇతర ఆర్టిస్టుల సింక్ చేస్తూ డాన్స్ చేసినంత మాత్రాన ఆ స్టెప్పులు,నాటు నాటు స్టెప్పులు ఒకటే అనడంలో అర్థం లేదని అంటున్నారు.
































