Rajesh Appasani : 2019 ఎన్నికలు ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తను ఉన్న ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్కరాష్ట్రం అయిన తెలంగాణకు కేసును సిబిఐకి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, చేతిలో అధికారం, అయినా కేసులో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ కేసు ఎన్ని రోజులుగా నత్తనడకన సాగుతున్నా ప్రస్తుతం ఒక ఫోన్ కాల్ లీక్ తో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ విషయాల మీద పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని ఆయన విశ్లేషణ అందించారు.

సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి చెప్పిన నవీన్ ఎవరు…
సిబిఐ విచారణలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచి ప్రశ్నలు సంధించినపుడు తొలుత మౌనంగా ఉన్న ఆయన సైంటిఫిక్ ఆధారాలు ముందుంచి ప్రశ్నల్ని అడగడంతో కొన్ని అంశాలను చెప్పినట్లు బయటికి వచ్చింది. ఇక ఈ విషయాల గురించి రాజేష్ అప్పసాని గారు మాట్లాడుతూ నవీన్ అనే వ్యక్తిగత పేరు అవినాష్ రెడ్డి బయటపెట్టినట్లు తెలుస్తోందని, ఆ నవీన్ రెడ్డి వైఎస్ భారతి వద్ద పనిచేసే వ్యక్తి అంటూ తెలిపారు. నవీన్ కి కాల్ చేస్తేనే భారతి గారితో మాట్లాడే వీలు ఉంటుందని విచారణలో అవినాష్ రెడ్డి తెలిపారు. వివేకానంద హత్య కేసులో అంతకుముందు సిబిఐ విచారణ జరిగినపుడు సాక్షుల నుండి సేకరించిన ఆధారాల ప్రకారం వివేకానంద హత్య వెంటనే అక్కడికి చేరుకున్న వారు అవినాష్ రెడ్డి, అలానే భాస్కర్ రెడ్డి ఇంకా కొంత మంది. వాళ్ళు లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని కొద్ది సమయం తరువాత బయటికి వచ్చారని ఆ హత్యను సహజ మరణం కింద చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని రాజేష్ అప్పసాని అభిప్రాయపడ్డారు.

హత్య జరిగాక వైఎస్ భారతికి అవినాష్ రెడ్డి ఫోన్ వెళ్లడం జరిగింది. అయితే హత్య జరిగిన వెంటనే సహజ మరణం అని చిత్రీకరించారు, భారతి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షిలో అదే వార్త వచ్చింది. మరుసటి రోజే చంద్రబాబు హత్య చేయించాడు అనే వార్త వాళ్ళ పత్రికలోనే రావడం విశేషం. మరీ టీడీపీ వాళ్ళు హత్య చేసుంటే మొదట అవినాష్ రెడ్డి అతని తరువాత భాస్కర్ రెడ్డి వీళ్ళు వెళ్లి ఎంధుకు సాక్ష్యాలను చేరిపేశారు. వీటన్నిటికీ సమాధానం వైఎస్ భారతి గారు ఇవ్వాలి అంటూ రాజేష్ అప్పసాని అభిప్రాయపడ్డారు. జగన్, విజయమ్మ, వివేకానంద వీళ్లంతా వైఎస్ కుటుంబం, వైఎస్ భారతికి భాస్కర్ రెడ్డి స్వయానా మేన మామ, ఇక అవినాష్ రెడ్డి మేన మామ కొడుకు. వీళ్ళు ఒక వర్గం లాగా ఎంపీ సీట్ కోసం జరిగిన గొడవలో వివేకానంద తనకు కానీ షర్మిలకు కానీ ఎంపీ సీట్ ఇవ్వాలని అడగడం అవినాష్ కి ఇప్పించాలని భారతి పట్టుబట్టడంతో ఈ హత్య జరిగి ఉండొచ్చు అంటూ తెలిపారు.