Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలలోకి రాబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త క్షీణించడంతో రాజకీయాలలోకి రావాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇలా ఈయన రాజకీయాలలోకి రాకపోయినా ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపాలని కూడా పలువురు కోరుకున్నారు.

ఈ క్రమంలోనే రజినీకాంత్ రాజకీయాల గురించి ఆయన సోదరుడు సత్యనారాయణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తిరుచెందూర్ కుమార స్వామి వారిని దర్శించుకున్నటువంటి సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ…
రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు అయితే ఆయన రాజకీయాలలోకి వచ్చిన చేసేదేమీ లేదని సత్యనారాయణ తెలియజేశారు. అయితే తాను ఇలా మాట్లాడటానికి గల కారణాలను కూడా సత్యనారాయణ తెలియజేశారు. ప్రస్తుతం రజనీకాంత్ గారికి 70 సంవత్సరాల వయసు ఈ వయసులో ఆయన రాజకీయాలలోకి వచ్చిన ఎలాంటి ప్రయోజనాలు ఉండవని సత్యనారాయణ తెలిపారు.

Rajinikanth: ఆరోగ్యంగా ఉంటే చాలు…
ఆయన రాజకీయాలలోకి రాకపోయినా సంతోషంగా ఎంతో ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని ఆయన సోదరుడు కోరుకున్నారు. ఇలా రజనీకాంత్ రాజకీయాలు గురించి ఆలోచన విరమించుకున్న అనంతరం ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని ఈ సినిమా త్వరలోనే విడుదల కానందని సత్యనారాయణ పేర్కొన్నారు.



























