Rakshitha Reddy: సినీ నటుడు శర్వానంద్ గత రెండు రోజుల క్రితం ఘనంగా రక్షిత మెడలో మూడు ముళ్ళు వేసి తన వివాహ వేడుకను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తెను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీరి వివాహం జైపూర్ లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు సినీ సెలబ్రిటీలు బంధువుల సమక్షంలో వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఇక వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రక్షిత గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ వివాహం చేసుకోవడానికి రక్షిత ఏ మేరకు కట్న కానుకలు తీసుకువచ్చారన్న విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే శర్వా నంద్ తో వివాహం జరగడానికి రక్షిత భారీగానే కట్న కానుకలు తీసుకువచ్చారని తెలుస్తుంది. రక్షిత నుంచి కట్నం కానుకలు తీసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని శర్వానంద్ చెప్పినప్పటికీ ఈమె తల్లిదండ్రులు మాత్రం తమ అమ్మాయికి ప్రేమగా ఇస్తున్నామంటూ తన పేరిట ఉన్నటువంటి ఆస్తులు అన్నింటిని కూడా తనకే ఇచ్చారని తెలుస్తోంది. ఖరీదైన కార్లతో పాటు అన్ని సౌకర్యాలతో కూడిన బంగ్లా అలాగే కొంతమేర డబ్బును కూడా కానుకగా ఇచ్చారని సమాచారం.

Rakshitha Reddy: 100 కోట్ల ఆస్తిని తెచ్చిన రక్షిత…’
ఈ విధంగా రక్షిత రెడ్డి పేరున ఉన్నటువంటి ఆస్తులు విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇలా 100 కోట్ల రూపాయల ఆస్తులను కట్నంగా శర్వానంద్ భార్య తన ఇంటికి తీసుకువచ్చారని చెప్పాలి. అయితే శర్వానంద్ సైతం హీరోగా భారీగానే డబ్బు సంపాదిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆయన స్టేటస్ కు తగ్గట్టుగానే రక్షిత సైతం కట్నకానుకలు తీసుకొచ్చారని తెలుస్తుంది.































