కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పలువురు నటీమణులు వెబ్ సిరీస్ లో అడుగు పెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ఇప్పటికే అక్కినేని కోడలు సమంత, వెండితెర చందమామ కాజల్ అగర్వాల్, మిల్క్ బ్యూటీ తమన్నా లాంటివారు పలు వెబ్ సిరీస్ లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరి స్టార్ సెలబ్రిటీల చూపుకూడా వెబ్ సిరీస్ ల పై పడింది.

ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమయ్యారు. ప్రేక్షకుల్లో బాగా డిమాండ్ పెరిగినా ఓటీటీ కంటెంట్‌తో త్వరలోనే ఆకట్టుకోవాలని రకుల్ ప్రీత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే సరికొత్త కథలను వినే పనిలో పడ్డారు. దర్శకులు కొత్త వారైనా కథలో నైపుణ్యం ఉంటే చేయడానికి ఈ బ్యూటీ సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఓటీటీ అనేది బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీ వేదికపై విడుదల కావడమే అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ వేదికగా విడుదలయ్యే వెబ్ సిరీస్ లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో సరైన కథ నచ్చితే ఓటీటీ లో ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ బ్యూటీ సిద్ధమైనట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.































