Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ విక్టరీ వెంకటేష్ నటించిన కీసి కా భాయ్… కిసి కీ జాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల 21వ తేదీ విడుదల కానుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి ఏంటమ్మా అనే సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ వెంకటేష్ ముగ్గురు పంచ కట్టలో అదిరిపోయే మాస్ పర్ఫామెన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో 48 గంటల్లోనే 43 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టిస్తుంది.
ఇకపోతే తాజాగా ఏంటమ్మా సాంగ్ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ ఈ సినిమాలో డాన్స్ చేయడం గురించి మాట్లాడినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ ఏంటమ్మా సాంగ్ చేసేటప్పుడు తెగ ఎంజాయ్ చేసామని తెలిపారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి తాను నటించడం నిజంగానే కల నిజమైనట్లుందని, ఇది మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు.ఇక ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు మరింత కిక్ వస్తుందని చరణ్ తెలిపారు.

Ram Charan: ఇద్దరు స్టార్ హీరోలతో నటించడం గొప్ప అనుభూతి…
ప్రస్తుతం చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ డాన్స్ వీడియో కూడా వైరల్ గా మారింది.ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దుబాయ్ వెకేషన్ లో ఉన్నటువంటి రామ్ చరణ్ తిరిగి రాగానే ఈ సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోతారు.































