RRR Movie: గత కొంత కాలం నుంచి మెగా కుటుంబానికి,మంచు కుటుంబానికి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఇక మా ఎన్నికల సమయంలో ఈ మనస్పర్ధలు మరింత ఎక్కువగా చోటు చేసుకున్నాయి.ఇక మెగా బ్రదర్ నాగబాబుకి మోహన్ బాబు కుటుంబానికి మధ్య ఏదో ఒక విషయం గురించి వివాదం వస్తూనే ఉంది.

తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలలో భాగంగా మంచు మనోజ్ పరోక్షంగా మెగా బ్రదర్ నాగబాబు పై విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మనస్పర్థలు ఉన్నప్పటికీ రామ్ చరణ్ నటించిన RRR సినిమాపై మంచు బ్రదర్స్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా మనోజ్ స్పందిస్తూ ఇది ఎంతో గొప్ప సినిమా ఈసినిమాని జక్కన్న మలిచిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో ఎంజాయ్ చేశాను ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.ప్యూర్ విజువల్ ట్రీట్, ఇంత గొప్ప సినిమాను నిర్మించిన నిర్మాత డి.వి.వి దానయ్యగారికి థాంక్స్. కీరవాణిగారు అద్భుతమైన సంగీతం అందించారు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.
రికార్డుల కోసం ఎదురు చూస్తున్న…
Waiting to make a list of all the records that is going to be made today. What a moment for Telugu Cinema ????????! Wishing nothing but the best to master @ssrajamouli garu and to my brothers @tarak9999 @AlwaysRamCharan and the entire team of #RRR
— Vishnu Manchu (@iVishnuManchu) March 24, 2022
ఇక ఈ సినిమా గురించి విష్ణు స్పందిస్తూ… ఎన్ని రికార్డులు క్రియేట్ అవుతాయో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తెలుగు సినిమాలో ఎంత గొప్ప సమయమో ఇది. ఇక్కడ విష్ చేయడానికి ఏమీ లేదు రాజమౌళి గారు నా సోదరులు, చరణ్, మొత్తం చిత్ర బృందానికి అభినందనలు అంటూ విష్ణు ట్వీట్ చేశారు.ఈ విధంగా ఈ సినిమా గురించి వీరిద్దరు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
What a film it is ????
— Manoj Manchu????????❤️ (@HeroManoj1) March 25, 2022
Loved each and every frame of Jakkanna @ssrajamouli Garu and the terrific performances of @tarak9999 & @AlwaysRamCharan ????????????































