Ram Charan:.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఇక ఈ పాట ఆస్కార్ అవార్డు నామినేషన్ లో నిలవడంతో ప్రమోషన్ల కోసం ఇప్పటికే చిత్ర బృందం అమెరికా చేరుకున్నారు.

ఇలా రాజమౌళి రామ్ చరణ్ కలిసి ఇప్పటికే అమెరికాలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొన్నారు, మరోవైపు పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.
ఈ విధంగా రాంచరణ్ అమెరికాలో ఏ కార్యక్రమానికి ఏ ఇంటర్వ్యూ హాజరైన కూడా సూట్ ధరించి చాలా రాయల్ లుక్ లో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన అమెరికా పర్యటన కోసం వేసుకున్నటువంటి సూట్స్ ధర ఎంత వాటిని ఎవరు డిజైన్ చేశారనే విషయం కోసం పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా రాంచరణ్ ధరించిన ఈ సూట్స్ అన్ని కూడా చెన్నైకి చెందిన ప్రముఖ డిజైనర్ తయారు చేశారని తెలుస్తోంది.

Ram Charan:. రాయల్ లుక్ లో కనిపిస్తున్న చరణ్…
ఇక రాంచరణ్ అమెరికాలో ధరించిన ఈ సూట్స్ ఒక్కొక్కటి సుమారు 13 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటాయని సమాచారం. ఇలా చరణ్ ఇంత ఖరీదైన సూట్స్ వేసుకొని అమెరికా ఇంటర్వ్యూలలో చాలా రాయల్ లుక్ లో కనిపిస్తే సందడి చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ కు సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం మనకు తెలిసిందే.
All the latest looks of @AlwaysRamCharan are swoon worthy ???????? he is class apart ???? pic.twitter.com/otEZpLfs0S
— Bhav (@Dr_bhavG) March 1, 2023



























