Ram Charan: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను శనివారం రోజు సాయంత్రం వరంగల్ జిల్లాలోని హనుమకొండలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఇతర నటీనటులు దర్శక నిర్మాతలు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం హాజరయ్యారు. అయితే ఈ సక్సెస్ మీట్ లో భాగంగా రామ్ చరణ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి సైలెంట్‌గా ఉంటాడేమో కానీ ఆయన వెనక ఉన్న తాము మాత్రం సైలెంట్‌గా ఉండమని.. ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే.. ఏం జరుగుతుందో.. కొంత మందికి తెలియదు అని తెలిపారు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రి, నటి రోజా మెగా ఫ్యామిలీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Ram Charan: రోజాకు వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్…
రామ్ చరణ్ రోజాకి ఇండైరెక్టుగా వార్నింగ్ ఇచ్చాడు అంటూ పలువురు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ హనుమకొండలోని సక్సెస్ మీట్ లో భాగంగా చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే విషయం గురించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.






























