Ram Charan: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2019లో వినయ విధేయ రామతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య సినిమాలతో బిజీగా మారాడు. ఇందులో ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

ఆచార్య కూడా త్వరలోనే విడుదల కాబోతోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అతడు చేయబోయే ప్రతీ సినిమాకు పారితోషికం రూ. 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని.. శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు అతడు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఇటీవల టాక్ నిపించింది.

అయితే దీనిపై అతడు స్పందించాడు. అవన్నీ అసత్యాలు అని కొట్టి పారేశాడు. ఇటీవల అతడు ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో నిర్వహించగా.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. అక్కడ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చాడు.
రాజకీయ ప్రవేశంపై చరణ్ సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ రేంజిలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట కదా.. అని అడగ్గా మొదట.. ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని రామ్ చరణ్ అన్నారు. అసలు అవి నాకు ఎవరు ఇస్తారు అంటూ తిరిగి ప్రశ్నించాడు. అవన్నీ పనీ పాట లేని వాళ్లు స్పష్టించిన పుకార్లు అంటూ చెప్పాడు. ఇవన్నీ అబద్దాలని.. వాటిని నమ్మొద్దని సూచించాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి లాగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా అని చరణ్ అడిగినప్పుడు, “నాకు దాని స్పెల్లింగ్ కూడా తెలియదు” అని చరణ్ రాజకీయ ఎంట్రీ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.






























