RGV:సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న వారిలో రాంగోపాల్ వర్మ ఒకరు. నిత్యం ఏదో ఒక వివాదంతో ద్వారా వార్తల్లో ఉంటారు. ఇలా ఏదో ఒక విషయం గురించి వార్తల్లో నిలిచే వర్మ తాజాగా “బడవ రాస్కెల్” అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి యాంకర్ గా శ్యామల వ్యవహరించారు.

ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా వర్మ శ్యామల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న శ్యామల వర్మ గారిని కలవడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్మ శ్యామల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ… మీరు ఇందాక ఓ మాట అన్నారు మీరు నన్ను కలవడం ఇదే మొదటిసారి అని అది పక్కన పెడితే.. ఇంత అందంగా ఉన్న మీరు ఇంత కాలం నా కళ్ళ నుండి ఎలా తప్పించుకున్నారు అంటూ యాంకర్ శ్యామల పై వర్మ కామెంట్ చేశారు. అదేవిధంగా మీరు నన్ను తోపు, రౌడీ అన్నారు…. నేను రాస్కెల్ కూడా అంటూ వర్మ ఈ వేదికపై మాట్లాడారు.
వర్మ మాటలకు నవ్వుకున్న శ్యామల…
ఈ విధంగా యాంకర్ శ్యామల గురించి వర్మ షాకింగ్ కామెంట్స్ చేయడంతో శ్యామలతో పాటు అక్కడున్న వారందరూ కూడా నవ్వుకున్నారు. మొత్తానికి వర్మ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక వివాదం లేదా రచ్చ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ శ్యామల గురించి వర్మ చేసిన వైరల్ అయ్యాయి.




























