తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాస్పద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఏ విషయం గురించి మాట్లాడినా అది తీవ్ర వివాదాలకు కారణం అవుతుంది. ఈ క్రమంలోనే గోపాల్ వర్మ నేడు కొండ సురేఖ బయోపిక్ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లారు.

ఇలా అక్కడికి వెళ్ళిన రామ్ గోపాల్ వర్మను మీడియా చుట్టుముట్టి పలు ప్రశ్నలను వేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ప్రశ్నించారు. టిడిపి నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి బోస్ డీకే అనే పదం అర్థం గురించి ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ ఆ పదంపై స్పందించడానికి నిరాకరించారు. ఈ మేరకు అతనికి ఈ పదానికి అర్థం తెలియదని డిక్షనరీలు వెతికే అంత టైం కూడా తనకు లేదని.. ఇప్పటికే ఈ పదం గురించి చాలామంది మాట్లాడారు. మరి నాతో కూడా మాట్లాడించకండి అంటూ ఈ ప్రశ్నలను దాటవేశారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలకు స్పందించిన రాంగోపాల్ వర్మ గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర సాము వంటి వాటిని నేర్చుకోవడం ఎంతో అవసరమని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.































