రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఆర్జీవీ. ఎప్పుడు ఎవరి మీద కామెంట్ చేస్తారో.. ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు. వర్మ ఎలాంటి కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసినప్పటికీ ఎక్కువగా ఆయన చెప్పే మాటలకే చాలామంది ఫ్యాన్స్ అయిపోతుంటారు.

సినిమాలను చాలా మంది థియేటర్లు లేక ఓటీటీలకు ఇస్తుంటే.. అతడు మాత్రం ఆర్టీవీ థియేటర్ అంటూ చిన్నపాటి ఓటీటీ లాంటిది ఏర్పాటు చేసుకొని తన సినిమాలను అందులోనే విడుదల చేస్తుంటారు. అలా అందరు ఒక వైపు ఉంటే.. అతడు మాత్రం నాదారే రాహదాని అన్నట్లు ఓ వైపు ఉంటాడు. అయితే ఇటీవల సునీల్ నటించిన ‘కనబడుట లేదు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆ ఈవెంట్‌లో వర్మ స్పీచ్ అందరికంటే హైలెట్ అయింది.
రచయిత కే.విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిలో రాజమౌళి పేరు ప్రస్తావించారు. విజయేంద్ర ప్రసాద్ గడ్డం గురించి వర్మ అడిగి నవ్వులు పూయించారు.

నా పెద్ద డౌట్ ఏంటంటే.. మీ గడ్డానికి స్ఫూర్తి ఎవరు? నరేంద్రమోడీనా? లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథను ఇచ్చారు కాబట్టి వాల్మీకి కంటే పెద్దగా ఉండాలని అనుకున్నారా? లేదా నా బోడి కొడుక్కే అంత ఉంటే.. నాకు ఎంత ఉండాలని రాజమౌళి కంటే ఎక్కువగా ఉండాలని పెంచుతున్నారా? అని విజయేంద్ర ప్రసాద్‌ను ఆట పట్టించారు వర్మ. ఇక ఆ మాటలకు విజయేంద్రప్రసాద్ నవ్వుతూనే ఆర్జీవికి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. దీంతో అక్కడ జనాలు విజల్స్ తో క్లాప్స్ కొట్టారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


























