Ram Gopal Varma:టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు చిరునామాగా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వివాదాల ద్వారా నిత్యం వార్తల్లో ఉంటారు.దర్శకుడిగా ఒకప్పుడు ఎంతో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల పై కన్న సోషల్ మీడియా పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక వర్మ ఏం మాట్లాడినా దానిలో ఎంతో లాజిక్ ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే వర్మ ఇప్పుడే ఇలా ఉన్నారా లేదా చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఈ క్రమంలోని సోదరి విజయలక్ష్మి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా వర్మ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వర్మ సోదరి విజయలక్ష్మి ఓ ఇంటర్వ్యూ ఛానల్ తో మాట్లాడుతూ అన్నయ్య చిన్నప్పటి నుంచి కూడా ఎంతో సరదాగా భిన్నంగా ఆలోచించే వ్యక్తిత్వం కలవాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే మేము చిన్నప్పుడు మా మామయ్యతో కలిసి సినిమాకి వెళ్ళామని అయితే ఆ సినిమాలో విలన్ ట్రైన్ పేల్చడం కోసం ఒక బాంబు టైమ్ సెట్ చేసి ట్రైన్ పెల్చేసాడు. ఆ సన్నివేశాన్ని చూసిన మా అన్నయ్య మన దేశంలో ఎప్పుడు ట్రైన్స్ టైం కి రావు కదా అతను ఎలా సెట్ చేసి పేల్చాడు అంటూ ప్రశ్న వేశారు.ఇలా ఎంతో లాజికల్ ప్రశ్నలు అడుగుతూ అందరిని ఆలోచింప చేసేవాడు అంటూ విజయలక్ష్మి తెలిపింది.
వారి సంతోషం కోసమే అలా…
ఇక అన్నయ్య అమ్మాయిల పిచ్చోడని చాలా మంది అనుకుంటారు. నిజానికి తను ఏం మాట్లాడినా అమ్మాయిలు సంతోషంగా ఉండేలా మాట్లాడుతారని తన సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ క్రమంలోనే చిన్నప్పుడు నా స్నేహితురాలు ఇంటికి రావడంతో తనని చూసిన వర్మ మీ కళ్ళు బాగున్నాయని తనతో చెప్పాడు ఆ మాట విన్న నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని అయితే తాను అన్నయ్య పొగిడాడని ఎంతో సంతోష పడుతున్న సమయంలో తనను సరిగ్గా చూసావా లేదా తనకు మెల్లకన్ను ఉందని చెప్పాను. అయితే ఆ మాటకు వర్మ నేను అసలు ఆ అమ్మాయిని చూడలేదు ఏదో అలా సరదాగా చెప్పానని చెప్పారని విజయలక్ష్మి తెలిపారు.అన్నయ్య ఏం మాట్లాడినా వారి సంతోషం కోసమే మాట్లాడతారు కానీ అన్నయ్య అమ్మాయిల పిచ్చోడు మాత్రం కాదు అంటూ ఈ సందర్భంగా విజయలక్ష్మి వ్యక్తిత్వం గురించి వెల్లడించారు.






























