పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లోని కృష్ణానగర్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నెలరోజుల కిందట అమెరికా నుంచి రామగుండం వచ్చింది. అయితే 20 రోజుల క్రితం ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెతోపాటు తల్లికీ పాజిటివ్‌రాగా, ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

సరిగ్గా వారం తరువాత మరోసారి టెస్ట్ చేయించగా నరిష్మారెడ్డికి కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నెగటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా ఆమె ఆరోగ్యం ఏమాత్రం కుదుటపడలేదు. దీంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం జాయిన్ చేసారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె కన్నుమూసింది. మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ‘నువ్వు అమెరికాలో ఉన్నా బతికుండే దానివి.. మమ్మల్ని చూడటానికి వచ్చి కరోనాకు బలైపోయావా తల్లీ..’ అంటూ తల్లడిల్లిపోతున్నారు.






























