Ramba: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగిన రంభ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన పిల్లలతో పాటు ప్రయాణిస్తున్న కారును మరొకరు వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రంభతో పాటు తన కుమార్తె స్వల్ప గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం తన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.

ఈ ప్రమాదం కెనడాలోని టొరంటోలో చోటుచేసుకుంది.రంభ స్కూల్ నుంచి తన పిల్లలను ఇంటికి తీసుకురావడానికి కారులో వెళ్లి వస్తుండగా ఈమె కారును మరో కారు వేగంగా వచ్చి ఢీ కొనింది. ఈ ప్రమాదంలో రంభతో పాటు తన కుమార్తె సాషాకి స్వల్ప గాయాలు అయ్యాయని ప్రస్తుతం తన కుమార్తె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు.

Ramba: ఆందోళనలో అభిమానులు..
ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన కూతురు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి అంటూ ఆమెకు జరిగిన ప్రమాదం గురించి చెప్పుకొచ్చారు.రంభకు జరిగిన ప్రమాదం గురించి తెలుసుకున్న అభిమానులు ఒకసారిగా షాపింగ్ గురయ్యారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు రంభ కుమార్తె క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు.



























